News May 7, 2025
పాల్వంచ పెద్దమ్మ తల్లికి పంచామృతాభిషేకం

పాల్వంచ పెద్దమ్మ గుడిలో శుక్రవారం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ముందుగా మేళ తాళాలతో ఆలయ అర్చకులు, భక్తులతో కలిసి జన్మస్థలం వద్ద ఉన్న అమ్మవారికి పంచామృతాభిషేకం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించి పూజలు చేశారు. అనంతరం మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, పంచ హారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు జరిపారు. ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఈవో రజిని కుమారి తెలిపారు.
Similar News
News March 15, 2026
మార్చి 31లోపు ఈ పనులు చేయండి!

FY26 ముగిసేలోపు(మార్చి 31) పొదుపు ఖాతాల్లో కనీస మొత్తం డిపాజిట్ చేయాలి. లేదంటే అవి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. రీయాక్టివేట్ చేయడానికి ఫైన్ చెల్లించాలి.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏటా కనీసం ₹500 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 జరిమానా.
* సుకన్య సమృద్ధి యోజన యాక్టివ్‌గా ఉండాలంటే ₹250 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 ఫైన్.
* నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఏటా ₹1,000 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹100 పెనాల్టీ.
News March 15, 2026
KMR: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని, అందిన అర్జీలను అధికారులు తక్షణమే పరిశీలించి పరిష్కరిస్తారని ఆయన ఆదివారం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ వేదికను వాడుకోవాలని సూచించారు.
News March 15, 2026
పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) అంటే ఏంటి?

ఇది పైప్‌లైన్ ద్వారా నేరుగా ఇంటి వంటగదికి చేరుతుంది. మీటర్ ద్వారా వినియోగాన్ని బట్టి బిల్లు వస్తుంది. యూనిట్ ధర దాదాపు రూ.40-60 (క్యూబిక్ మీటర్) వరకు ఉంటుంది. గ్యాస్ అయిపోతుందన్న చింత ఉండదు. సాధారణంగా నెలకు రూ.400-800 బిల్లు వస్తుంది. కనెక్షన్ పొందడానికి రూ.7 వేల వరకు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. HYDలోనూ BGL సంస్థ PNG సౌకర్యం కల్పిస్తోంది. అయితే అన్ని ప్రాంతాల్లో PNG లేకపోవడం పెద్ద సమస్య.


