News May 7, 2025
పన్నుల వసూల్లో పశ్చిమగోదావరి జిల్లా రెండవ స్థానం

చెత్త, మంచినీటి పన్ను వసూళ్లలో ప.గో.జిల్లా రెండో స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఎంపికకు 26 జిల్లాలు పోటీపడగా, మన జిల్లాకు రెండో స్థానం రావడం ఆనందంగా ఉందని అన్నారు. 24న గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ అవార్డును జిల్లా పంచాయతీరాజ్ అధికారి అరుణశ్రీ అందుకున్నట్లు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ సిబ్బందిని ఆమె అభినందించారు.
Similar News
News July 7, 2025
ప్రతి విద్యార్థికి ఒక మొక్క అందజేత: కలెక్టర్

‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందజేసి, వారి తల్లి పేరున పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ఇందుకోసం ‘లీప్ యాప్’ను రూపొందించి, అందులో విద్యార్థులు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News July 7, 2025
జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేసీ

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ సోమవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 44,792 మెట్రిక్ టన్నుల ఎరువులు ప్రైవేటు, ఏపీ మార్కెట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు కావలసిన మొత్తం ఎరువులు లభ్యంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ రాహుల్ స్పష్టం చేశారు.
News July 7, 2025
భీమవరం: పీజీఆర్‌ఎస్‌కు 165 అర్జీలు

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 165 అర్జీలు అందినట్లు ఆమె తెలిపారు. వీటిని సంబంధిత అధికారులకు పంపి, పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.