News May 7, 2025
పల్నాడు వాసులకు గిన్నిస్ బుక్ రికార్డు

పల్నాడు ఖ్యాతిని చాటుతూ ఇద్దరు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. సత్తెనపల్లికి చెందిన అంకిత్ పాల్ 18 దేశాల నుంచి 1046 మందితో కలిసి స్వరాలు ఆలపించి రికార్డు సృష్టించగా, మాచవరం మండలం మొర్జంపాడుకు చెందిన గారపాటి మణిదీప్తి 18 దేశాల నుంచి 1100 మంది కళాకారులతో గంట పాటు కీబోర్డుపై సరళీ స్వరాలు వినిపించి గిన్నిస్ ఘనత సాధించారు. వీరికి శుక్రవారం విజయవాడలో ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
Similar News
News March 16, 2026
ప్రేయసికి భర్తను ‘లీజు’కు ఇస్తానన్న భార్య.. కానీ!

మోసం చేసిన భర్తకు విడాకులు ఇవ్వకుండా అతనిని ప్రేయసికే అద్దెకు ఇవ్వడానికి సిద్ధమైందో భార్య. దీనిద్వారా ఖున్ క్వాంగ్ నెలకు ₹85వేలు డిమాండ్ చేసింది. ఈ ఘటన థాయిలాండ్‌లో జరిగింది. వీరికి వివాహమై 10 ఏళ్లయింది. గతేడాది ఓ మహిళతో భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుర్తించింది. దీనిపై ప్రశ్నించగా ఇరువురూ విడిచి ఉండలేమన్నారు. దీంతో ఆమె అద్దె ప్రతిపాదన పెట్టగా ప్రేయసి ఒప్పుకుంది. కానీ భర్త అంగీకరించలేదు.
News March 16, 2026
విశాఖలో రోడ్డు ప్రమాదం.. తుని యువతి మృతి

విశాఖపట్నం BHPV వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందారు. స్కూటీపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో పార్వతీపురానికి చెందిన సీహెచ్ అనూష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తుని గవరపేటకు చెందిన ఆడారి కుసుమాంజలి మహాలక్ష్మి (19) చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. ఈ ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 16, 2026
సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్మెంట్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇతను కెరీర్‌లో 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20లు ఆడారు. 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 రన్స్ చేశారు. వికెట్ కీపర్‌గా 315 క్యాచ్‌లు పట్టారు. కెప్టెన్‌గా 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. U-19 సారథిగా 2006లో వరల్డ్ కప్ సాధించారు.


