News May 7, 2025

నిర్మల్ జిల్లాలో 45డిగ్రీల టెంపరేచర్

image

సూర్యప్రతాపం కారణంగా ప్రజలు విలవిలాడుతున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం దస్తూరాబాద్ మండలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నర్సాపూర్ (జి), మమడ, పెంబి మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడదెబ్బ కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే.

Similar News

News March 18, 2026

పాడేరులో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

image

కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ముందస్తు ఉగాది కానుక అందించింది. 40% వైకల్యం ఉన్నవారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు హామీ మేరకు తీసుకొచ్చిన ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఈశ్వరి తెలిపారు.

News March 18, 2026

దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి కట్టుబడి ఉంది: అచ్చెన్న

image

శ్రీకాకుళం ఆర్టీసీ డిపోలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభించారు. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ఈ పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సహాయకులకు 50% రాయితీ కల్పించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ..దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి కట్టుబడి ఉందని తెలిపారు.

News March 18, 2026

అక్రమాలకు అడ్డాగా ఖమ్మం DCCB

image

ఉమ్మడి ఖమ్మం DCCB ద్వారా 50 శాఖల్లో రూ.3 వేల కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. కాగా అధికారుల పర్యవేక్షణ లేక కొందరు మేనేజర్లు, సిబ్బంది అక్రమార్కులతో కుమ్మక్కై భూమి లేకపోయినా సరే నకిలీ డాక్యుమెంట్లపై లోన్లు మంజూరు చేస్తున్నారు. KMM రూరల్ మండలంలో కనీసం ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా ఫేక్ డాక్యుమెంట్స్‌పై రూ.లక్షల్లో లోన్లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ జరుపుతున్నామని DCCB CEO తెలిపారు.