News May 7, 2025
ఒంగోలు: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించండి

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా, పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులతో, ఎపీఐఐసీ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో అమలు అవుతున్న ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పాలసీ 2015, ప్రధానమంత్రి ఉపాధి కల్పన వాటిపై సమీక్ష నిర్వహించారు.
Similar News
News March 27, 2026
మార్కాపురం జిల్లాలో ఆ బస్సులు చాలా డేంజర్..!

మార్కాపురం ప్రమాదంతో నెల్లూరు (D) కలిగిరికి చెందిన <<19487686>>హరికృష్ణ <<>>ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన డొక్కు బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని సమాచారం. వాటిపై పాత ట్రావెల్స్ పేర్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రయాణ సమయంలో తరచూ రిపేర్లకు గురవుతుంటాయని.. చాలాసార్లు మార్గమధ్యంలోనే బస్సులను మారుస్తుంటారని అందులో ప్రయాణించిన వాళ్లు చెబుతున్నారు.
News March 27, 2026
చీమకుర్తి వద్ద ప్రమాదం.. విద్యార్థి స్పాట్‌డెడ్

చీమకుర్తి బైపాస్‌లో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బైక్‌పై వేగంగా వస్తున్న ముగ్గురు స్కూల్ విద్యార్థుల బైక్ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, గాయపడిన వారు చీమకుర్తిలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు.
News March 27, 2026
కనిగిరి: ఆరు నెలల గర్భిణిని బలి తీసుకున్న బస్సు

మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో అవ్వా, మనవరాలు మృతి చెందిన విషయం తెలిసిందే. కనిగిరి మండలం చల్లగిర్లకు చెందిన తమ్మిశెట్టి రుక్మిణి (22) <<19481682>>ఆరు నెలల గర్భవతి<<>>. బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రంలో పనులకోసం వెళ్లి భర్త తిరుపాలు, అత్త పిచ్చమ్మతో కలిసి బస్సులో స్వగ్రామం బయలుదేరింది. ఈ ప్రమాదంలో అత్త- పిచ్చమ్మ, రుక్మిణి మృతి చెందగా భర్త గాయాలతో బయటపడ్డాడు.


