News May 7, 2025
సివిల్స్ ర్యాంకర్ల మార్కులు ఇవే

ఇటీవల సివిల్స్-2024 అభ్యర్థుల ర్యాంకులను విడుదల చేసిన UPSC తాజాగా వారు సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచింది. సివిల్స్ మెయిన్స్‌కు 1,750, ఇంటర్వ్యూకు 275 మార్కులు(మొత్తం 2,025) ఉంటాయి. టాప్-5 ర్యాంకర్ల మార్కులు ఇలా.. 1. శక్తి దూబే- 1,043; 2. హర్షిత గోయల్- 1,038 3. డోంగ్రే అర్చిత్ పరాగ్- 1,038 4. షా మార్గి చిరాగ్- 1,035 5. ఆకాశ్ గార్గ్- 1,032
Similar News
News April 3, 2026
పార్లమెంటు ప్రత్యేక సెషన్ ‘కోడ్’ ఉల్లంఘనే: INC

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు ఈనెల 16-18 తేదీల్లో పార్లమెంటు సెషన్ నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయంపై INC మండిపడింది. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించడమేనని విమర్శించింది. ‘ఈనెల 29న తుది పోలింగ్ ముగిశాక పెట్టాలని విపక్షాలు సూచించాయి. మంత్రి రిజిజుకు ఖర్గే లేఖ రాశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికే సభ పెడుతున్నారు’ అని INC నేత జైరామ్ రమేశ్ దుయ్యబట్టారు.
News April 3, 2026
రాముడిగా తెలుగు హీరోల్లో ఎవరు బాగుంటారు?

ప్రస్తుత తెలుగు హీరోల్లో శ్రీ రాముడి గెటప్‌లో ఎవరు బాగుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా ‘రామాయణ’ టీజర్‌లో రణ్‌బీర్ రాముడిగా కనిపించడం, ‘వారణాసి’లో మహేశ్ బాబు కూడా ఆ పాత్రలో నటిస్తుండటంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని రాముడిగా చూడాలని కోరుకుంటున్నారు. మరి తెలుగు హీరోల్లో ఎవరు బాగా సెట్ అవుతారు? ఎవరు బాగా నటించగలరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News April 3, 2026
RED ALERT: రేపు 73 మండలాల్లో తీవ్ర వడగాలులు

APలో ఎండలు ముదురుతున్నాయి. రేపు 73 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల 40-44 డిగ్రీలు రికార్డయ్యే ఛాన్సుందని రెడ్ అలర్ట్ ఇచ్చింది. కాగా ఇవాళ మన్యం(D) గుమ్మలక్ష్మీపురంలో 41.8, చిత్తూరు(D) పెద్దపంజనిలో 41.4, విజయనగరం(D)వంగరలో 41.1, చాలా ప్రాంతాల్లో 39-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


