News May 7, 2025

నాగిరెడ్డిపేట: అప్పు ఇవ్వ లేదని బైక్, ధాన్యం కాల్చివేత

image

అప్పు తిరిగి ఇవ్వలేదని ప్రతికారంగా వడ్ల కుప్ప, ఎక్సెల్ బైక్ దహనం చేసిన ఘటన మాసంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లారెడ్డి వివరాలు.. నాగిరెడ్డి పేట మండలం మాసంపల్లి గ్రామానికి చెందిన చాకలి బాలమణి, సాయిలు అల్లుడు బాలకృష్ణ వద్ద రూ.2లక్షల అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ప్రతికారంగా బైక్‌ను, ధాన్యం కుప్పను కాల్చి వేశాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News March 8, 2026

వాల్మికిపురం: స్కూటర్ ఢీకొని తల్లి మృతి.. బిడ్డకు సీరియస్

image

స్కూటర్ ఢీకొని తల్లి మృతి చెందడంతో ఆమె కుమారుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శనివారం రాత్రి వాల్మీకిపురం మండలంలో జరిగిన ఘటనపై ఎస్సై తిప్పేస్వామి వివరించారు. గుర్రంకొండ మండలం రామాపురంకి చెందిన మురళి భార్య రెడ్డిలక్ష్మి ఆమె కుమారుడు బాలాజీ బైకులో సొంతపనిపై చింతపర్తికి వచ్చారు. పనిముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో వెళుతుండగా.. వాల్మీకిపురం బైపాస్‌లో స్కూటర్ ఢీకొని తల్లి మృతి చెందింది.

News March 8, 2026

మహిళా దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో జరిగిన సమీక్షలో మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ స్టాల్స్ ఏర్పాటు, వేదిక తదితర ఏర్పాట్లు సమన్వయంతో చేయాలని పేర్కొన్నారు.

News March 8, 2026

దేశంలో మరో UT ఏర్పాటంటూ వార్తలు.. ఖండించిన కేంద్రం

image

WBలోని సిలిగుడి కారిడార్ సమీపంలో కొత్త కేంద్ర పాలిత ప్రాంతం(UT) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఓ వార్త వైరలవుతోంది. ఇందులో బిహార్‌, బెంగాల్‌లోని 6 జిల్లాలు ఉంటాయంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని PIB Fact Check ఖండించింది. కాగా ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాలు సిలిగుడి నుంచే వెళ్తాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాకు ఇది సమీపంలో ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.