News May 7, 2025
MNCL: లక్ష్మీప్రసన్న ప్రాణం తీసిన ఫోన్ కాల్

మంచిర్యాలలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాల భవనంపై నుంచి దూకి విద్యార్థిని లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకోవడానికి ఫోన్ కాల్ కారణమైంది. బుధవారం రాత్రి లక్ష్మీ ప్రసన్న కాలేజీ వాచ్ మెన్ ఫోన్ ద్వారా చిన్నమ్మ కొడుకు వెంకటేశ్‌కు కాల్ చేసింది. రాత్రివేళ ఫోన్ ఎందుకు ఇచ్చావని ఆయన వాచ్‌మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలియడంతో లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News March 14, 2026
సూళ్లూరుపేట: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడీ

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలను అపహరించుకొని పరారయ్యాడు. ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2026
NRPT: జిల్లాలో సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్

జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, గృహావసరాలకు విద్యాలయాలకు, ఆసుపత్రులకు సిలిండర్ల సరఫరాలో లోటు రానివ్వమని అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో గ్యాస్ డీలర్లు సెల్స్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. సిలిండర్ల సరఫరాకు సంబంధించిన వివరాలను ప్రతి రోజు అందించాలని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలను నమ్మకండని సూచించారు.
News March 14, 2026
తిరుపతి: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడి

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు ₹30 లక్షల విలువైన 916 హాల్‌మార్క్ బంగారు నగలను అపహరించుకుని పరారయ్యాడు. ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


