News May 7, 2025

27న మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్

image

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి ఈ నెల 27న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 – 12 గంటల వరకు 6వ తరగతి, మధ్యాహ్నం 2 – 4గంటల వరకు 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఉంటుందని మోడల్ స్కూళ్ల డైరెక్టర్ శ్రీనివాసచారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 40,332 మంది దరఖాస్తు చేసుకున్నారని, హాల్ టికెట్లు ఇప్పటికే విడుదల అయ్యాయని ఆయన వివరించారు.

Similar News

News March 22, 2026

కర్నూలులో 23న ప్రజా ఫిర్యాదుల వేదిక: కలెక్టర్

image

ఈ నెల 23 (సోమవారం)న కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

News March 22, 2026

ఎండల్లో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

image

వేసవిలో శరీర చల్లదనం కోసం ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే ఇవి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ‘వాటిలో చక్కెర, కెఫీన్ అధికంగా ఉంటాయి. దీంతో టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, దంతాలు పుచ్చిపోవడం, ఆస్టియోపోరోసిస్, నిద్ర లేమి, డీహైడ్రేషన్, గుండె సమస్యలు రావొచ్చు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, షర్బత్, మజ్జిగ, పండ్లు, కూరగాయల స్మూతీలు తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు.
#ShareIt

News March 22, 2026

‘నలభీమ పాకం’ అర్థం ఏమిటి?

image

మగవాళ్లు అత్యంత రుచికరమైన వంటకం చేసినప్పుడు ‘నలభీమ పాకం’ జాతీయాన్ని ఉపయోగిస్తారు. భారతంలో దమయంతి భర్త నలుడు. జూద వ్యసనంతో నిషాధ రాజ్యాన్ని కోల్పోయి బుషపర్ణుడి వద్ద వంటవాడిగా చేరి అద్భుతమైన వంటలు చేసేవారు. పాండవుల అజ్ఞాతవాసంలో విరాటరాజు దగ్గర భీముడు వంట పనిచేసేవారు. వీరిద్దరి పనిని కవులు నలభీమ పాకంగా అభివర్ణించారు. మీలో ఎవరైనా రుచికరమైన వంటలు చేసేవారున్నారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>