News May 7, 2025

కామారెడ్డి: ఉరేసుకొని వ్యక్తి మృతి

image

బాన్సువాడ మండలం బేతాళ స్వామి కాలనీకి చెందిన రాంపురం నారాయణ ఉరేసుకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నారాయణ తన కూతురికి 25 ఏళ్ల క్రితం ఇల్లరికం పెళ్లి చేశాడు. కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడి గురువారం రాత్రి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం ఉరేసుకోగా కూతురు విజయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News March 21, 2026

కెనాల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

image

SLBC, డిండి ఎత్తిపోతల, అచ్చంపేట కెనాల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు మొదలైనట్లు స్పష్టం చేశారు. టన్నెల్‌లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. సొరంగంలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని, ఆధునిక టెక్నాలజీతో తవ్వకాలు జరపాలని సూచించారు.

News March 21, 2026

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు SP

image

రంజాన్ సందర్భంగా నెల్లూరు జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.

News March 21, 2026

WGL: నాలుగు మండలాల్లోనే వర్షం

image

వరంగల్ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షపాతం సగటున 0.9 మిల్లీమీటర్లు నమోదుకగా, జిల్లా వ్యాప్తంగా 4.9 మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో సంగేంలో 1.8 మిల్లీమీటర్లు, కిలా వరంగల్‌లో 1.5 మిల్లీమీటర్లు, వరంగల్‌లో 0.8 మిల్లీమీటర్లు, గీసుకొండలో 0.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదుకగా, మిగిలిన 9 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.