News May 7, 2025
ఏడుపాయల చెక్ డ్యాంలో మునిగి వ్యక్తి మృతి

ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సమీపంలో చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్‌కు చెందిన దేవరపాగ వీరస్వామి(40) శుక్రవారం ఓ విందు నిమిత్తం కుటుంబంతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు వెళ్లిన వీరస్వామి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతి చెందారు. దీంతో విందులో విషాదం నెలకొంది.
Similar News
News March 7, 2026
MDK: యువతే దేశ భవిష్యత్: అదనపు ఎస్పీ

మెదక్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 జిల్లా స్థాయి పోటీలలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. “50 Years of Emergency – Lessons for Indian Democracy” అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో యువతే దేశ భవిష్యత్ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
News March 7, 2026
పోలీసులు భాగస్వాములు కావాలి: మెదక్ అదనపు ఎస్పీ

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పోలీసులు భాగస్వాములు కావాలని అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు సురక్షితంగా చేరుకోండి (Arrive Alive) కార్యక్రమం హోం, రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల అమలు, హెల్మెట్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
News March 7, 2026
మెదక్: పరేడ్ పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్

మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్‌లో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ పాల్గొని, పోలీసు సిబ్బంది అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించి పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై సూచనలు చేశారు. పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలనతో పాటు సిబ్బంది మధ్య సమన్వయం (కోఆర్డినేషన్) పెరుగుతుందని తెలిపారు.


