News May 7, 2025

అనకాపల్లి: నిందితుడిని పట్టించిన బైక్ రిజిస్ట్రేషన్..!

image

గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన గంజాయి అక్రమ రవాణా కేసులో ఐదేళ్లుగా పరారీలో ఉన్న వంతల సుందర్ రావు(23)ను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్ఐ పి.రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..సుందర్‌ది అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నారు. 36 కిలోల గంజాయి రవాణా చేస్తూ, రెండు బైక్‌లను, గంజాయిని వదిలి పరారయ్యాడని తెలిపారు. తాజాగా బైక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఒడిశాలో అరెస్టు చేశామన్నారు.

Similar News

News March 14, 2026

ఖమ్మం: వారం వ్యవధిలో భార్యాభర్తల మృతి

image

తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన మెట్టు వెంకన్న (55), ఆయన భార్య రాధ (50) గుండెపోటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఆరు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

News March 14, 2026

వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలంలో స్వామివారి నిత్య కళ్యాణ వేడుక శనివారం కనులపండువగా సాగింది. తెల్లవారుజామునే గర్భాలయంలో సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన అర్చకులు.. అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా బేడ మండపానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం తర్వాత శాస్త్రోక్తంగా కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ గావించి వేడుకను పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

News March 14, 2026

పదో తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. శనివారం జనగామలోని సెయింట్ మేరీస్ స్కూల్, ధర్మకంచ జెడ్పీహెచ్‌ఎస్‌ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, బయటి వ్యక్తుల ప్రవేశం నిషిద్ధమని స్పష్టం చేశారు.