News May 7, 2025
విజయవాడ: బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

మహేశ్ బాబు, కియారా అద్వానీ నటించిన ‘భరత్ అనే నేను'(2018) చిత్రాన్ని విజయవాడలో శనివారం రీ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం విజయవాడలోని 2 థియేటర్లలో రీ రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
Similar News
News March 7, 2026
మూడుసార్లూ కివీస్‌దే పైచేయి.. ఈసారి చెక్ పడాల్సిందే!

T20WC: ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడేందుకు భారత్ ఇంకో గెలుపు దూరంలో ఉంది. అయితే ప్రత్యర్థి న్యూజిలాండ్‌తో T20WC చరిత్రలో భారత్‌కు పేలవ రికార్డ్స్ ఉండటం చర్చనీయాంశమైంది. భారత్ NZతో ఆడిన మూడు మ్యాచుల్లోనూ (2007, 2016, 2021) కివీస్‌దే విజయం. ఈసారి ఆ జట్టు ఓపెనింగ్, ఫీల్డింగ్, స్పిన్ బలంగా ఉందని.. సెమీస్ తరహాలోనే భారత్ రాణించి కప్పు కొట్టాలని, ఆ స్ట్రీక్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News March 7, 2026
బాబీ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్?

తాను త్వరలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి పనిచేయనున్నానని రైటర్ కోన వెంకట్ ప్రకటించారు. ఆ సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నట్లు చెప్పారు. అయితే, బాలీవుడ్ వర్గాలు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదంటున్నాయి. హృతిక్ ఓకే చెప్పలేదని.. కథ మాత్రమే విన్నారంటున్నాయి. ప్రస్తుతం ఆయన బిగ్ బడ్జెట్ మూవీ కోసం రెడీ అవుతున్నారని టాక్. అయితే ఆ మూవీయే కోన-బాబీ సినిమా అని మరికొంత మంది అంటున్నారు.
News March 7, 2026
కామారెడ్డి: పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ

పోలీస్ సిబ్బందిని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. భిక్కనూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100 నంబర్‌కు డయల్ చేశారు. తక్షణమే స్పందించిన కానిస్టేబుల్స్ వినయ్ కుమార్, రామాంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి అతని ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినందిస్తూ నగదు ప్రోత్సాహం అందజేశారు.


