News May 7, 2025
NGKL: ఇళ్ల ముందు నిలిపిన బైక్‌లే వారి టార్గెట్..!

MBNR, GDWL, NGKL, WNP, NRPT జిల్లాల్లో ఇళ్ల ముందు నిలిపిన పలు బైక్‌లను రాత్రిళ్లు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల ఎస్ఐ కళ్యాణ్ తెలిపిన వివరాలు.. గద్వాల వాసి వంశీ, మరో ఏడుగురు కలిసి బైక్‌లను చోరీ చేసేవారు. గతంలో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 35బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వంశీని శుక్రవారం ధరూర్‌మెట్‌లో అరెస్ట్ చేసి మరో 5 బైక్‌లను సీజ్ చేశారు.
Similar News
News March 5, 2026
ASF: విద్యుత్ ద్వారా ప్రభుత్వానికి రూ. కోటి ఆదాయం

ASF జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈనెల 3న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,900 మెగావాట్ల వినియోగం నమోదైంది. జిల్లాలో 1,737 మెగావాట్ల వినియోగం జరిగినట్లు అధికారులు తెలిపారు. రోజుకు 17.35 లక్షల యూనిట్లు వినియోగమవుతూ ప్రభుత్వానికి సుమారు రూ. కోటి ఆదాయం లభిస్తోంది.
News March 5, 2026
కృష్ణా వర్శిటీ విద్యార్థులకు అలర్ట్

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీఈడీ, స్పెషల్ బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 2,3,4వ సెమిస్టర్(వన్ టైం ఆపర్చునిటీ) పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 6 మధ్య నిర్ణీత తేదీలలో వర్శిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
News March 5, 2026
ముగ్గురు సహచరులు – ఒక్కటే లక్ష్యం: నారా లోకేశ్

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన ముగ్గురు నేతల (లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు) అరుదైన ఫొటోను మంత్రి నారా లోకేశ్ పంచుకున్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీ పొందిన ముగ్గురు సహచరులుగా.. ఈ గెలుపు తమపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతిరోజూ పూర్తి నిబద్ధతతో, వినమ్రతతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.


