News May 7, 2025

కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో భద్రతాబలగాల ‘ఆపరేషన్ కగార్’ కొనసాగుతోంది. మావోయిస్టుల అగ్రనేతృత్వమంతా కర్రెగుట్టలోనే ఉందన్న వార్తల నేపథ్యంలో వేలాది బలగాలు కొండల్ని దిగ్బంధించాయి. ఈ ఆపరేషన్‌ను ఆపాలని మావోయిస్టులు లేఖ విడుదల చేసినా కేంద్రం స్పందించకపోవడం గమనార్హం. అటు మానవహక్కుల సంఘాలు కూడా ఆపరేషన్‌ను ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.

Similar News

News March 8, 2026

తిరుపతిలో భారీగా నకిలీ మద్యం.. వాస్తవం ఇదే!

image

తిరుపతిలో భారీగా నకిలీ మద్యం లభ్యం అంటూ SMలో వస్తున్న వార్తలపై FACT CHECK స్పందించింది. ‘తిరుపతి రూరల్ పాడిపేట ఇందిరమ్మ గృహాల వద్ద చంద్రగిరి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో నగేష్ రెడ్డి(38) నివాసంలో 34 లీటర్ల అనధికార మద్యం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి కెమికల్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు’. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News March 8, 2026

ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం.. నేడు CBN హాజరు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభాభిషేక వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మొదలైన ఈ మూడు రోజుల క్రతువు ఇవాళ్టితో ముగియనుంది. నేడు ప్రధాన ఘట్టం జరగనుంది. ఆలయ విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి పండితులు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

News March 8, 2026

T20 WC ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

image

INDvsNZ <<19325584>>ఫైనల్<<>> కోసం అహ్మదాబాద్ స్టేడియంలో మిక్స్‌డ్ సాయిల్ పిచ్ (70% రెడ్, 30% బ్లాక్) రెడీ చేశారు. బౌలర్లకు బౌన్స్ లభిస్తుంది. పేసర్లకు సహకరిస్తుంది. బ్యాటర్లకూ అడ్వాంటేజ్ ఉంటుందని, భారీ స్కోర్ నమోదవ్వొచ్చని అంచనా. Dew వచ్చే అవకాశముంది. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే ఛాన్సుంది. ఈ పిచ్‌ను SAvsCAN (feb 9) మ్యాచుకు వాడారు. SA 213/4 స్కోర్(1st బ్యాటింగ్) చేసి, 57 రన్స్ తేడాతో గెలిచింది.