News May 7, 2025

నిర్మల్: కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై లైంగిక దాడి

image

నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోగ్లిలో కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గాయాలతో ఇంటికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి గ్రామానికి చెందిన సునీల్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 16, 2026

కామారెడ్డి: ఏసీబీ రైడ్స్‌.. ఆర్థిక లావాదేవీలపై అక్రమాల గుర్తింపు

image

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ రేంజ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఏసీబీ సోదాల్లో రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తదితర కార్యకలాపాల తనిఖీలు నిర్వహించారు. 2025-26లో అనధికార నిర్మాణాల్లో 47 ఫిర్యాదులు వచ్చాయని, కోటి రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉన్నాయని, ప్రాపర్టీ టాక్స్‌లో తేడాలున్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.

News March 16, 2026

ఏలూరు: సబ్సిడీ సిలెండర్ల పట్టివేత

image

కామవరపుకోట మండలంలో వాణిజ్య అవసరాలకు గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడీ) సిలిండర్లను వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐ ప్రసాద్ సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. శివ గాయత్రి హోటల్, తడికలపూడి, మణికంఠ భోజన హోటల్ కామవరపుకోటలో తనిఖీలు చేశారు. అక్రమంగా వినియోగిస్తున్న 7 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఆయన గుర్తించారు. వాటి విలువ రూ.19,806లు ఉంటుందని, యజమానులపై కేసు నమోదు చేశామన్నారు.

News March 16, 2026

అమలాపురం: రూ.7 కోట్ల మోసం.. నిందితులకు జైలు శిక్ష

image

అమలాపురంలో సుమారు 1600 మంది నుంచి రూ.7 కోట్లు వసూలు చేసి మోసగించిన ఓ సంస్థ ఎండీకి 7 ఏళ్లు, డైరెక్టర్లకు 5 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి గందం సునీత తీర్పునిచ్చారు. నిందితులకు మొత్తం రూ.48.60 లక్షల జరిమానా విధించారు. పాత కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ అభినందించారు.