News May 7, 2025
సూర్యాపేట: రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్ డెడ్

మునగాల మండలం ఆకుపాముల వద్ద శుక్రవారం రాత్రి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువతి మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాదు నుంచి విజయవాడకు బైకుపై అన్నా చెల్లెలు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి బైక్ అకుపాముల వద్ద
గేదె అడ్డురావటంతో డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో బైకు వెనకాల కూర్చున్న ఆమె రోడ్డుపై పడిపోయింది. వెనుక నుంచి లారీ ఆమె పై నుంచి వెళ్లడంతో మృతి చెందింది.
Similar News
News March 21, 2026
జగిత్యాల: జీవన్ రెడ్డి 25న కీలక భేటీ… నిర్ణయం ఖాయం?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈనెల 25న తన అనుచరులతో కలిసి రాజీనామా చేసే అవకాశముంది. జగిత్యాలలోని ఓ గార్డెన్‌లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం సమూహంగా పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై కూడా అదే రోజు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.
News March 21, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,45,970, 22 క్యారెట్ల గోల్డ్ రూ.2,750 తగ్గి రూ.1,33,800 పలుకుతోంది. అటు వెండి కిలోపై ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,50,000కి చేరింది.
News March 21, 2026
గద్వాలలో మరో విషాదం నింపిన యాక్సిడెంట్ ఘటన!

గద్వాల జిల్లా అయిజ నరసింహ కాలనీకి చెందిన మిట్టదొడ్డి నాగరాజు కుమారుడు విష్ణు చైతన్య(18) శనివారం మృతిచెందినట్లు కాలనీవాసులు తెలిపారు. ఈనెల17న గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన <<19408308>>రోడ్డు ప్రమాదంలో<<>> విష్ణు చైతన్య తీవ్రంగా గాయపడ్డాడు. మొదట కర్నూలుకు, ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం HYDఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే అతడి ఫ్రెండ్ రాము మృతిచెందిన విషయం తెలిసిందే.


