News May 7, 2025
MBNR: BRAOU పీజీ అసైన్మెంట్లు విడుదల

డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024 -25 విద్యా సంవత్సరం PG 1st & 2nd year అసైన్మెంట్లు విడుదలయ్యాయి. అసైన్మెంట్ వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ braou.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అసైన్మెంట్ సబ్మిట్ ఆఖరి తేదీ మే 15. సమాచారం కోసం రీజినల్ సెంటర్ 009 MVS కళాశాల మహబూబ్‌నగర్‌లో గాని లేదా 7382929609 నంబర్‌లో తమను సంప్రదించాలని డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
SHARE IT
Similar News
News March 19, 2026
రంజాన్ ఎల్లుండే..

భారత్‌లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
News March 19, 2026
జిల్లాలో ఘనంగా ఉగాది.. ఊరూరా పంచాంగ శ్రవణాలు

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగను జిల్లా ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన జిల్లాలోని గ్రామగ్రామాన పంచాంగ శ్రవణాల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగబోయే మంచి చెడులను పూజారులు వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు హాజరయ్యారు.
News March 19, 2026
రేపే బడ్జెట్.. ఆరు కొత్త పథకాలు!

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా యంగ్ ఇండియా కిట్స్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ, పాడి రైతులకు రాయితీపై పశువుల సరఫరాను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.


