News May 7, 2025
ఒంగోలు: స్కూటీ.. హత్య కేసును మలుపు తిప్పింది

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలకంగా దొరికిన స్కూటీ ఆధారంగా కేసు పురోగతి ఊపందుకుంది. అమ్మనబ్రోలుకు చెందిన వ్యక్తి ఈ హత్యలో కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ గ్రామం పోలీసుల కనుసన్నల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఈ నెల 29వ తేదీన అమెరికాకు వెళ్లటానికి టికెట్స్ కూడా బుక్ చేసుకోగా స్కూటీ ఆధారంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News March 17, 2026
నిర్దోషిగా బయటకు వస్తా: ఏలూరు MP

హైదరాబాద్‌లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని, ఎంపీగా గెలిపించిన ప్రజలకు, పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘విచారణలో నేను నిర్దోషిగా బయటకు వస్తా’ అని పేర్కొన్నారు.
News March 17, 2026
PPM: ‘అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండరాదు’

జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రహదారులు, భవన నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అభ్యంతరాలను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించి, పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబరులో అటవీ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
News March 17, 2026
వేములవాడ: 19న ఉగాది, 27న సీతారాముల కళ్యాణం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో ఈనెల 19వ తేదీ గురువారం ఉగాది పర్వదిన వేడుకలు నిర్వహించనున్నారు. 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. 27వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ పార్కింగ్ స్థలం వద్ద గల శివార్చన వేదికపై స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.


