News May 7, 2025

కుప్పంలో 163 సెక్షన్ అమలు

image

కుప్పంలో 163 సెక్షన్ విధిస్తూ తహశీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వై.చిట్టిబాబు ఉత్తర్వులు విడుదల చేశారు. సోమవారం కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మండల సచివాలయానికి వంద మీటర్ల వరకు ప్రజలు ఎవ్వరూ గుంపులు గుంపులుగా ఉండొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Similar News

News March 24, 2026

చిత్తూరు DMHOగా నాగ శశిభూషణ్ రెడ్డి

image

చిత్తూరు డీఎంహెచ్ఓగా నాగ శశిభూషణ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇది వరకు అనంతపురం జిల్లా డీఐవోగా పని చేశారు. ఈ జీవోలో ప్రస్తుత డీఎంహెచ్ఓ సుధారాణిని ఎక్కడకు బదిలీ చేశారు పేర్కొనలేదు.

News March 24, 2026

చిత్తూరు: కన్నతండ్రిపై కుమారుడి దాడి

image

కన్న తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘటన పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. రాంనగర్‌కు చెందిన భాస్కర్ రాజు కుమారుడు గోవర్ధన్‌కు ఏడాది క్రితం వివాహం చేశారు. దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సామరస్యంగా ఉండాలని సూచించడంతో కుమారుడు తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. దీనిపై మళ్లీ పంచాయతీ పెట్టి, కోడలి పట్ల అనుకూలంగా మాట్లాడటంతో గోవర్ధన్ తండ్రిపై దాడి చేశాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.

News March 24, 2026

చిత్తూరు: సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. సమస్యలపై అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు.