News May 7, 2025

జడ్చర్ల: వక్ఫ్ సవరణ చట్టం అవగాహన సదస్సులో డీకే అరుణ

image

జడ్చర్లలోని ప్రేమ్ రంగా గార్డెన్‌లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ సవరణ చట్టం అవగాహన సదస్సులో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ముస్లిం పేదలకు న్యాయం చేసేందుకు ఏర్పడిన ధార్మిక సంస్థనే వక్ఫ్ చట్టం అని అన్నారు. 2018 రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో 80 లక్షల ఎకరాలు భూములు వక్ఫ్ ఆస్తులున్నట్లు తేలిందన్నారు. కానీ ఈ ఆస్తుల వల్ల ఏ ఒక్క పేద ముస్లింకు న్యాయం జరగలేదన్నారు.

Similar News

News March 19, 2026

పల్నాడు: ముగిసిన కౌన్సిల్ పాలన.. అమల్లోకి ప్రత్యేక అధికారుల పాలన

image

జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను అమలులోకి తెచ్చింది. ప్రజలకు నిరంతర సేవలు అందించడమే లక్ష్యంగా నియమితులైన ఈ అధికారులు.. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అభివృద్ధి పనులు కుంటుపడకుండా, పన్నుల వసూళ్లు వేగవంతం చేస్తూ పారదర్శక పాలన అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

News March 19, 2026

కుదిరితే ఏప్రిల్ 6నే ఇంటర్ రిజల్ట్స్!

image

TG: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు వేగంగా అడుగులు వేస్తోంది. వీలైతే ఏప్రిల్ 6న లేదంటే ఏప్రిల్ 10లోపు ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. జూన్ 1న కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మే 31 నాటికే సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీనికోసం ఈ నెల 15 నుంచి స్పాట్ వాల్యుయేషన్ టైమ్‌ను ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. గతేడాది ఏప్రిల్ 22న ఫలితాలు వచ్చాయి.

News March 19, 2026

కొత్తగూడెం: పాఠశాల లైబ్రరీలకు రూ.25 లక్షల నిధులు

image

ప్రభుత్వం గ్రంథాలయ నిధులను విడుదల చేసింది. జిల్లాలోని 214 ఉన్నత పాఠశాలలకు రూ.11.12 లక్షలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.13.92 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులను కరిక్యులం, అసెస్‌మెంట్, లైబ్రరీ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాలని డీఈవో బి.నాగలక్ష్మి ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, నిబంధనల ప్రకారం పుస్తకాలు కొనుగోలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.