News May 7, 2025
ఎండలు, వడగాలులు.. బయటికెళ్లొద్దు!

తెలుగు రాష్ట్రాల్లో 40-44 డిగ్రీల ఎండలు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. TGలో 2 రోజులు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో <
* మధ్యాహ్నం వేళ్లలో బయటికి వెళ్లకపోవడం మంచిది.
Similar News
News March 20, 2026
మేకలకు ‘వైడ్ యాంగిల్’.. గద్దలకు ‘బైనాక్యులర్’ విజన్!

జీవులన్నింటిలో మేకలు, గద్దలు విభిన్న దృష్టి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. మేకలు తమ దీర్ఘచతురస్రాకార కనుపాపల ద్వారా తల తిప్పకుండానే 320 డిగ్రీల వరకు చూడగలవు. గడ్డి మేస్తున్నప్పుడు కూడా శత్రువులను పసిగట్టేలా ప్రకృతి వీటికి ఈ ‘వైడ్ యాంగిల్’ చూపును ఇచ్చింది. అలాగే గద్దలు కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా నేలపై చిన్న ఆహారాన్ని స్పష్టంగా చూస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో.
News March 20, 2026
వాట్సాప్‌లో సూపర్ అప్‌డేట్

వాట్సాప్ త్వరలో ఫోన్ నంబర్ల స్థానంలో యూజర్ నేమ్స్, యునిక్ ఐడీలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో ఇది లాంచ్ కానున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ నంబర్ల అవసరం లేకుండానే కొత్త ఫ్రెండ్స్, గ్రూప్స్‌తో కనెక్ట్ అవొచ్చు. ఫోన్ నంబర్లతోనే కంటిన్యూ అవ్వాలనుకునేవారు ఆప్షనల్ ప్రైవసీ ఫీచర్ ఎంచుకోవచ్చు. ఇక దీంతో పాటు వాట్సాప్ లేని వారితో చాట్ చేసేందుకు వీలుగా గెస్ట్ చాట్ ఫీచర్ తేనున్నట్లు తెలుస్తోంది.
News March 20, 2026
రెండు వారాల్లో వీటన్నింటి ధరలు పెరిగాయ్: కాంగ్రెస్

ప్రధాని మోదీ హయాంలో దేశంలో అన్ని ధరలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గత రెండు వారాల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.146, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60, రిఫైన్డ్ ఆయిల్ రూ.30/L, పామ్ ఆయిల్ రూ.15/L, ఇండస్ట్రియల్ డీజిల్ రూ.22/L, ప్రీమియం పెట్రోల్ రూ.2.35/L, జొమాటో డెలివరీ ఫీ రూ.2.40, విమాన టికెట్లు రూ.425-2,300, ప్లాస్టిక్ బాటిల్ సెట్ రూ.40, ఇండక్షన్ స్టవ్ ధర 40% పెరిగిందని పేర్కొంది.


