News May 7, 2025

MDCL: రూ.500లతో 6 దేవాలయ దర్శనం 

image

MDCL ఆర్టీసీ అధికారులు బెస్ట్ టెంపుల్ టూర్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. కేవలం పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300 ఛార్జితో ఏకంగా బద్రీనాథ్ టెంపుల్, వర్గల్ జ్ఞాన సరస్వతి టెంపుల్, కొమరవెల్లి మల్లన్న, అలియాబాద్ వెంకటేశ్వర స్వామి, చీర్యాల లక్ష్మీనరసింహస్వామి, భువనగిరి స్వర్ణగిరి దేవాలయాలు దర్శించుకోవచ్చని తెలిపారు. ఈ టూర్ బస్ స్పెషల్ మెట్రో ఎక్స్ ప్రెస్ కావడంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తించదన్నారు. 

Similar News

News March 7, 2026

అలా తిరుపతిలో భారీ స్కామ్ బయటపడింది..!

image

ఓ వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో అనధికారిక పన్ను మార్పు స్కామ్ బయటపడింది. తిరుపతికి చెందిన భూపతి నాయుడు సాయంతో NRI వి.సరోజమ్మ సత్యనారాయణపురంలో ఓ ఇంటిని కొన్నారు. అతనే దానిని అద్దెకు ఇస్తానని నమ్మబలికి రినోవోషన్ చేసుకొని తన పేరు పైకి అన్ని పేపర్లు మార్చుకున్నాడు. ఆమె కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తీగలాగితే మున్సిపల్ కార్పొరేషన్‌లోని స్కామ్ బయటపడింది.

News March 7, 2026

అభివృద్ధి లక్ష్యాలపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలులోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, జిల్లా కీలక పనితీరు సూచికలపై ఆమె చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా తలసరి ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌డీజీ, కేపీఐ అంశాల్లో జిల్లా మరింత పురోగతి సాధించాలని ఆమె స్పష్టం చేశారు.

News March 7, 2026

9న చిత్తూరు DRC సమావేశం

image

చిత్తూరు కలెక్టరేట్‌లో ఈనెల 9న ఉదయం 11 గంటలకు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం(డీఆర్సీ) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వివిధ పథకాల అమలుతో పాటు వేసవి దృష్ట్యా తాగునీటి వసతి కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ(పీజీఆర్ఎస్, రీసర్వే), వ్యవసాయ, ఉద్యానశాఖ, విద్య, వైద్యఆరోగ్య శాఖ అంశాలపై చర్చించనున్నారు.