News May 7, 2025
MDCL: రూ.500లతో 6 దేవాలయ దర్శనం

MDCL ఆర్టీసీ అధికారులు బెస్ట్ టెంపుల్ టూర్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. కేవలం పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300 ఛార్జితో ఏకంగా బద్రీనాథ్ టెంపుల్, వర్గల్ జ్ఞాన సరస్వతి టెంపుల్, కొమరవెల్లి మల్లన్న, అలియాబాద్ వెంకటేశ్వర స్వామి, చీర్యాల లక్ష్మీనరసింహస్వామి, భువనగిరి స్వర్ణగిరి దేవాలయాలు దర్శించుకోవచ్చని తెలిపారు. ఈ టూర్ బస్ స్పెషల్ మెట్రో ఎక్స్ ప్రెస్ కావడంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తించదన్నారు.
Similar News
News March 23, 2026
ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలి: సీఎం

రైతులు లాభసాటి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ఆదివారం సిద్దిపేట(D) నర్మెట సభలో మాట్లాడారు. రైతులు మిల్లెట్స్ ఆర్గానిక్, కాయగూరలు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. పామాయిల్ సాగు లాభదాయకని, ఆదాయం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా లాభసాటి వ్యవసాయం చేస్తూ ఆదాయం పెంచుకోవాలన్నారు.
News March 23, 2026
మూలపేట పోర్టుపై రాజకీయ వేడి

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలకమైన మూలపేట పోర్టు పనుల్లో డొల్లతనం కనిపిస్తోందని కూటమిపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఇటీవల పోర్టుకు రోడ్డు, రైలు అనుసంధానానికి కేంద్రం 358 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది అభివృద్ధికి పెద్ద పీఠం ఇవ్వనుందని కూటమి పేర్కొనగా..YCP నిర్మాణాలు చకచక జరగడం లేదని MAR30న పోర్టు సందర్శన కార్యక్రమం నిర్వహించనుంది. దీంతో జిల్లాలో అభివృద్ధి పేరుతో రాజకీయ వేడి రాజుకుంటోంది.
News March 23, 2026
HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.


