News May 7, 2025

వికారాబాద్ జిల్లాలో టెండర్ల ఆహ్వానం

image

వికారాబాద్ జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి అన్ని ఔట్సోర్సింగ్ సర్వీసులు ఏర్పాటు చేయడం నిమిత్తం రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు సీల్ టెండర్లు కోరుతున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. టెండర్ల డాక్యుమెంట్లను జిల్లా ఉపాధి కల్పన అధికారి నుంచి మే 6లోగా కార్యాలయ పని దినాల్లో పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి మే 6వ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.

Similar News

News March 9, 2026

JN: చదువు మన తలరాతను మారుస్తుంది: MLA యశస్వినిరెడ్డి

image

చదువు మన తలరాతను మారుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. పాలకుర్తి మండలం చెన్నూరులోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యారంగ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు.

News March 9, 2026

మెదక్: ఇంటర్‌ పరీక్షలు.. 96.80 శాతం హాజరు

image

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్-I, ఎకనామిక్స్-I పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6,401 మందికి గాను 6,198 మంది, ఒకేషనల్ విభాగంలో 621 మందికి గాను 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొమ్మిదో రోజు మొత్తం 96.80 శాతం హాజరు నమోదైంది. DIEO మాధవి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.

News March 9, 2026

ఆసిఫాబాద్‌లో దివ్యాంగులకు సదరం శిబిరాలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో దివ్యాంగుల కోసం మార్చి నెలలో సదరం వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెల్లడించింది. మార్చి 11న కంటి చూపు, 12న మానసిక వైకల్యం, 18న రక్తస్రావ రుగ్మతలు (సికిల్ సెల్, తలసేమియా,హిమోఫిలియా), 25న మూగ/చెవిటి, 27న ఎముకల వైకల్యాలపై పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని శిబిరాలు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతాయి.