News May 7, 2025
కృష్ణా: బిర్యానీ ప్రయాణం.. బలి తీసుకున్న ప్రమాదం

బిర్యానీ తినడానికి వెళ్లిన ప్రయాణం రెండు యువజీవితాలను బలి తీసుకుంది. గురువారం అర్ధరాత్రి మోపిదేవి పరిధిలోని టోల్ ప్లాజా దాటి వస్తుండగా కంటైనర్ బైక్‌ను ఢీకొట్టింది. అవనిగడ్డకు చెందిన భాస్కర్, సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ యువకులు కావడంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 8, 2025
శ్రీరామపాద క్షేత్రంలో సుందర దృశ్యం

నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రంలో ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ఇటీవల కృష్ణానది వరదలకు శివలింగం, నంది వాహనం పూర్తిగా మునిగిపోయాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఆలయాన్ని ప్రక్షాళన చేశారు. అనంతరం భక్తుల సందర్శన కోసం సిద్ధం చేయగా, సాయం సంధ్య వేళ రంగుల వర్ణాలతో ఆలయం ప్రత్యేకంగా కనిపించింది. ఈ సుందర దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
News September 8, 2025
మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
News September 8, 2025
జిల్లాలో యూరియా కొరతలేదు: అసిస్టెంట్ కలెక్టర్

జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులెవరు ఆందోళన చెంద వద్దని జిల్లా(ట్రైని) అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జహీద్ తెలిపారు. మోపిదేవి మండలం పెదప్రోలు, కొక్కిలిగడ్డ పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. రైతుల నుంచి యూరియా పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ హరనాథ్, సొసైటీ ఛైర్మన్ నాదెళ్ల శరత్ చంద్రబాబు, రైతులు ఉన్నారు.