News May 7, 2025
ఉగ్రదాడితో ఆవేదన.. ఇస్లాంను వదిలేయనున్న ముస్లిం

పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో బెంగాల్‌కు చెందిన స్కూల్ టీచర్ సబీర్ హుస్సేన్ ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ‘కశ్మీర్‌లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేను. మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోంది. అందుకే ఇస్లాంను త్యజిస్తున్నా. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో స్వేచ్ఛ ఉంటుంది’ అని తెలిపారు.
Similar News
News April 3, 2026
హార్ముజ్ To ఇండియా.. షిప్‌కు ఎంత టైమ్ పడుతుంది?

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్‌ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్‌ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.
News April 3, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.
News April 3, 2026
ECIL, హైదరాబాద్‌లో 32 ఉద్యోగాలు

కాంట్రాక్ట్ ప్రాతిపదికన 32 పోస్టుల భర్తీకి ECIL, హైదరాబాద్.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్-14, టెక్నికల్ ఆఫీసర్-8, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్-3, సీనియర్ ఆర్టీజన్-7 ఉన్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ITI/డిప్లొమా/BE/బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 30-33 మధ్య ఉండాలి. APR- 9,18న ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు www.ecil.co.in చూడండి.


