News May 7, 2025
సంగారెడ్డి ఓపెన్ స్కూల్ పరీక్షలో ఇద్దరు డిబార్

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని డిబార్ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. జిల్లాలో పదవ తరగతికి 11, ఇంటర్మీడియట్ కు 17 పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసినట్లు చెప్పారు. ఓపెన్ స్కూల్ పరీక్షల్లో విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 3, 2026
కృష్ణా : సర్పంచ్‌ల పాలనకు సెలవ్..!

కృష్ణా జిల్లాలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. సర్పంచ్‌ల పదవీ కాలం ముగియటంతో నేటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. జిల్లాలో మొత్తం 497 పంచాయతీలు ఉండగా వివిధ కారణాల వల్ల 17 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 470 పంచాయతీల సర్పంచ్ టైమ్ అయిపోవటంతో అక్కడ ప్రత్యేక అధికారులను నియమించారు.
News April 3, 2026
SRPT: నాడు అటెండర్.. నేడు అదే ఆఫీసులో MRO

నడిగూడెం తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సోమపంగు సూరయ్య ప్రస్థానం అందరికీ స్ఫూర్తినిస్తోంది. 1995లో తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద అదే కార్యాలయంలో అటెండర్‌గా ఆయన వృత్తి జీవితం ప్రారంభించారు. పట్టుదలతో విద్యా అర్హతలు పెంచుకుంటూ, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అంచెలంచెలుగా ఎదిగారు. నాడు అటెండర్‌గా పనిచేసిన చోటే నేడు ఉన్నతాధికారిగా పీఠం అధిరోహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
News April 3, 2026
రూ.900 కోట్లతో వీఎంఆర్‌డీఏ బడ్జెట్

విశాఖలోని వీఎంఆర్‌డీఏ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.900 కోట్ల బడ్జెట్‌ను సిద్ధం చేసింది. బోర్డు ఆమోదం అనంతరం అమలు చేస్తామని కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. అదనంగా రూ.1000 కోట్ల ఆదాయం కోసం కొత్త లేఅవుట్లు అభివృద్ధి చేసి, ప్లాట్లు వేలం వేయనున్నారు. మాస్టర్ ప్లాన్-2041 అభ్యంతరాల నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి పంపించనున్నారు. పర్యాటక టికెట్ విధానంపై విస్తృత ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు.


