News May 7, 2025
నల్గొండ: విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్నేహితులు మృతి

నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో <<16216733>>తీవ్రవిషాదం<<>> చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బింగి మత్స్యగిరి (20), మర్రి శివకుమార్(21) ఇద్దరు స్నేహితులు బైక్‌పై వెళ్తూ స్తంభానికి డీకొట్టారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో స్నేహితుని వివాహం సందర్భంగా వచ్చి మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని మునుగోడు ఎస్ఐ రవి సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News April 1, 2026
నల్గొండ: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.
News April 1, 2026
NLG: 3 నెలలు పూర్తి.. అందని గౌరవ వేతనం

సర్పంచులు బాధ్యతలు స్వీకరించి వంద రోజులు పూర్తయినా ఇప్పటివరకు గౌరవ వేతనం అందలేదు. జిల్లాలోని 865 జీపీల్లో సర్పంచులకు నెలకు రూ. 5,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. ఆర్భాటంగా పదవులు చేపట్టిన ప్రజాప్రతినిధులకు క్షేత్రస్థాయిలో సమస్యలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.
News April 1, 2026
NLG: ప్రజాపాలన అప్లికేషన్స్ మాయం.. కలెక్టర్‌కు ఫిర్యాదు

కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన మహిళ పథకాల కోసం దరఖాస్తు చేసుకోగా, ఆన్‌లైన్ రశీదు ఉన్నా కార్యాలయంలో ఫైల్ కనిపించడం లేదు. దీనిపై బాధితురాలు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రికార్డుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


