News May 7, 2025

పాలమూరు యూనివర్సిటీలో పరీక్షలు వాయిదా..!

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని UG 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, 5 సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. PU పరిధిలోని MBNR, WNPT, GDWL, NGKL, NRPTలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అభ్యర్థన మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. వివరాలకు www.palamuruuniversity.com వెబ్‌సైట్ చూడండి.

Similar News

News March 5, 2026

❤️నచ్చేశావ్ సంజూ..

image

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.

News March 5, 2026

MBNR: బిడ్డను ఉయ్యాలలో వదిలి.. అనంతలోకాలకు

image

అప్పుల బాధ ఆ పసిగుడ్డుకు తల్లిని దూరం చేసింది.. తండ్రిని మృత్యువుతో పోరాడేలా చేసింది. జంగమయ్యపల్లిలో చోటుచేసుకున్న <<19307113>>దంపతుల ఆత్మహత్యాయత్నం<<>> స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పులు తీర్చే మార్గం కనిపించక మురుగని దంపతులు తమ పొలంలో పసిబిడ్డను ఉయ్యాలలో వేసి, పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు రవి తన తమ్ముడికి వీడియో కాల్‌ చేసి ‘మేము ఇక బతకలేం’ అని రోదించడం అందరినీ కలిచివేసింది.

News March 5, 2026

MBNR: ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

image

నవాబుపేట(M) జంగమయ్యపల్లిలో అప్పుల ఊబిలో చిక్కుకున్న ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మురుగని రవి-లావణ్య దంపతులు తమ పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు రవి HYDలోని తన తమ్ముడికి వీడియో కాల్ చేసి, తాము చనిపోతున్నామని తెలిపారు. ఈ ఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా.. కొన ప్రాణంతో ఉన్న రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.