News May 7, 2025
విశాఖలో క్యాబ్ బిల్డింగ్ ప్రారంభించనున్న సీఎం

ఆంధ్ర మెడికల్ కళాశాలలో నిర్మించిన క్యాబ్ బిల్డింగ్‌ను సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళంలో పర్యటించనున్న నేపథ్యంలో శనివారం సా.6 గంటలకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పూర్వ విద్యార్థుల నిధులతో ఈ క్యాబ్ బిల్డింగ్ నిర్మించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారి యంత్రాంగం, ఏఎంసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News March 18, 2026
విశాఖ: 69 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

విశాఖలో 69 పరిక్షా కేంద్రాలను అధికారులు బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్ ఏయూ ఇంగ్లిష్ మీడియం స్కూలును సందర్శించి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లును పరిశీలించారు. జిల్లాలో 29,916 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 28,843 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సదుపాయాలు కల్పించామని కలెక్టర్ ఆదేశించారు.
News March 18, 2026
దివ్యాంగ చిన్నారులతో విశాఖ కలెక్టర్ ఆత్మీయ విందు

విశాఖలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.
News March 18, 2026
భవానిపట్నం ప్యాసింజర్ (58504) రైలు రీ షెడ్యూలు

విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సిన భవానిపట్నం ప్యాసింజర్ (58504) రైలు బుధవారం రీ షెడ్యూలు అయింది. విశాఖ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు సాయంత్రం 7 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో రీ షెడ్యూలు జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.


