News May 7, 2025

NLG: పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

త్రిపురారం గ్రామ శివారులోని పంట పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న వారిపై శుక్రవారం త్రిపురారం పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారయ్యారని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. గ్రామ శివారులోని పొలాల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో ఐదుగురు పారిపోయినట్లు పేర్కొన్నారు.

Similar News

News July 5, 2025

విపత్తుల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధం: నల్గొండ కలెక్టర్

image

విపత్తుల నిర్వహణకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారులకు తెలిపారు. శనివారం అథారిటీ అధికారుల బృందం జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాశ్, అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాల్, వసీం ఇక్బాల్ బృందం రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారి గౌతమ్ ఆధ్వర్యంలో నల్గొండ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ను కలిశారు.

News July 5, 2025

BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్

image

నల్గొండ జిల్లా కట్టంగూరులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. శాలిగౌరారం మండలం ఊట్కూరు వాసి రజనీకాంత్ HYDలో ఉంటూ పని చేస్తున్నాడు. ఈరోజు స్వగ్రామంలో బంధువు చావుకు వచ్చి, తిరిగి HYDకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 5, 2025

NLG: వన మహోత్సవానికి సిద్ధం

image

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది పెద్దఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో నర్సరీలు, మొక్కలు నాటే ప్లాంటేషన్ సైట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 68.70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.