News May 7, 2025

రాయచోటి: ‘నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం’

image

నవోదయం-2.0లో భాగంగా అన్నమయ్య జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ప్రొహిభిషన్&ఎక్సైజ్ అధికారి మధుసూదన్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. నాటుసారా ప్రభావిత ప్రాంతాలైన వాయల్పాడు, MPL, PLR, MCUలను సారా రహిత ప్రాంతాలుగా మార్చేందుకు సూచనలు ఇచ్చారు. సారా తయారీ ప్రాంతాలను గుర్తించేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు.

Similar News

News March 16, 2026

మెదక్: తీవ్ర విషాదం.. పరీక్షకు వెళ్తూ మృతి

image

మనోహరాబాద్ మండలంలో ఆదివారం <<19387134>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఓ కంటైనర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇమాంపూర్ వాసి నిఖిల్(20) అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు మన్నె స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు బైక్‌పై ఉప్పల్‌లో పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 16, 2026

INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

image

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.

News March 16, 2026

కర్ణాటక తరలిపోతున్న పెద్దేముల్ సంపద!

image

పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్, రాంసింగ్ తండా తదితర ప్రాంతాల్లో ఎర్రరాయి అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు సహజమైన సంపదను దోచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రరాయిని వెలికితీసి కర్ణాటకకు తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.