News May 7, 2025

నర్సంపేట: ఒకరిపై పోక్సో కేసు నమోదు

image

వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై పోక్సో కేసు నమోదైంది. నర్సంపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఇటీవల అదే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడినందుకు ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 13, 2026

BSNLలో 120 పోస్టులు.. మార్చి 31 వరకు గడువు

image

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 7 వరకు ఆఖరు తేదీ కాగా.. మార్చి 31 వరకు పొడిగించారు. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ ఏప్రిల్ 1 – 8వరకు చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. వెబ్‌సైట్: bsnl.co.in/

News March 13, 2026

ఏలూరు: చిన వెంకన్నకు ‘గ్యాస్’ సెగ

image

యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ప్రభావం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంపై పడింది. స్వామివారి అన్న ప్రసాదాలు, ప్రసాదాల తయారీకి రోజుకు 30 నుంచి 40 గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తారు. ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడటంతో దేవాలయ అధికారులు గ్యాస్ స్థానంలో కట్టెలను వాడేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో వై.భద్రాజీ తెలిపారు.

News March 13, 2026

వరంగల్ విద్యార్థులూ.. ప్రాణాలతో చెలగాటం వద్దు!

image

నిన్నటితో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ముగియగా.. రేపు టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, సెలవుల్లో విద్యార్థులు ఖాళీగా ఉండకుండా ఏదైనా కోచింగ్ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా వాగులు, చెరువుల్లో ఈతకు వెళ్లడం సరికాదని వరంగల్ జిల్లా అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నందున, తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
SHARE