News May 7, 2025

టేకులపల్లి: అదనపు కట్నం వేధింపులతోనే దీపిక సూసైడ్

image

శుక్రవారం <<16216775>>దంపతులు<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. SI ప్రకారం.. టేకులపల్లి(M) రేగులతండా వాసి దీపిక(19), వెంకట్యాతండా వాసి శ్రీను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అత్తింటివారితో దీపికకు గొడవ జరగడంతో దంపతులు గురువారం కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగారు. కుటుంబీకులు KMM తరలించగా దీపిక చనిపోగా, శ్రీను చికిత్స పొందుతున్నాడు. అదనపు కట్నం వేధింపులతో సూసైడ్ చేసుకుందని దీపిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.

Similar News

News March 13, 2026

ఖమ్మం: గడ్డి మందును నిషేదించాలని కేంద్రమంత్రి కోరిన ఎంపీ

image

అనేక అనర్థాలు, ఆత్మహత్యలకు కారణమవుతున్న గడ్డిమందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రిని కలిశారు. విషపూరిత మందు వల్ల ప్రాణనష్టం జరుగుతోందని వివరించారు. ఇప్పటికే పలు దేశాలు దీన్ని నిషేధించాయన్నారు.

News March 13, 2026

కోమాలో మొజ్తబా ఖమేనీ: UK మీడియా

image

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారని UK మీడియా చెబుతోంది. ఆయన ఒక కాలు కోల్పోయారని, పొట్ట/లివర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని అంటోంది. అయితే <<19348883>>అలీ ఖమేనీ<<>> చనిపోయిన రోజే గాయపడ్డారా, లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ వార్తలు వచ్చిన కాసేపటికే <<19365703>>మొజ్తబా హెచ్చరించారంటూ<<>> ఇరాన్ ప్రభుత్వ TV ప్రకటన చేసింది. దీంతో ‘కోమాలో ఉన్నప్పటికీ USకు మొజ్తబా వార్నింగ్ ఇచ్చారు’ అని బ్రిటన్ మీడియా సెటైర్స్ వేసింది.

News March 13, 2026

కలెక్టర్ల సదస్సులో గుంటూరు కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో CM చంద్రబాబు జిల్లాల కలెక్టర్, SPలకు కీలక సూచనలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏదీ లేదని పేర్కొంటూ రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాటించాలని స్పష్టం చేశారు.