News May 7, 2025
రేపే BRS రజతోత్సవ సభ.. మీరు వెళ్తున్నారా?

WGL ఎల్కతుర్తిలో నిర్వహించనున్న BRS రజతోత్సవ సభకు మరో ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. 10 – 15 లక్షల మందితో 1,250 ఎకరాల్లో రేపు ఈసభ జరగనుంది. 500 మందికి సరిపడే విధంగా బాహుబలి వేదికను నిర్మించారు. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్లు, రెండున్నరవేల మందికి పైనే వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వెయ్యి ఎకరాలను 5 జోన్లుగా విభజించి పార్కింట్ ఏర్పాటు చేశారు. సభకు మీరు వెళ్తున్నారా? కామెంట్
Similar News
News March 13, 2026
యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

ఒమన్‌లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.
News March 13, 2026
టీచర్ ప్రతిరోజు భోజనం నాణ్యత చెక్ చేయాలి: మంత్రి లోకేశ్

AP: మైలవరంలో విద్యార్థులకు నాసిరకం భోజనం <<19370398>>పెట్టడంపై<<>> విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. MLAలు వారానికి ఒక స్కూలును సందర్శించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. డొక్కా సీతమ్మ పేరుపై నడుస్తున్న భోజన పథకంపై కుట్రలు చేసినా, నాణ్యత తగ్గినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2026
సిద్దిపేట: ‘చైతన్యం ద్వారా మోసాలను అరికట్టవచ్చు’

సిద్దిపేటలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా సివిల్ సప్లైస్ విభాగం ఆధ్వర్యంలో చైతన్య సదస్సు డీఎస్ఓ తనూజ అధ్యక్షతన నిర్వహించారు. మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తయారీ, గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆమె సూచించారు. చైతన్యం ద్వారానే మోసాలను అరికట్టవచ్చన్నారు. ఆహార పదార్థాల్లో కల్తీ, తూకాల్లో మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.


