News May 7, 2025

ఏడుపాయల చెక్ డ్యాంలో మునిగి వ్యక్తి మృతి

image

ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సమీపంలో చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా కొత్తపల్లి మండలం మరికల్‌కు చెందిన దేవరపాగ వీరస్వామి(40) శుక్రవారం ఓ విందు నిమిత్తం కుటుంబంతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు వెళ్లిన వీరస్వామి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతి చెందారు. దీంతో విందులో విషాదం నెలకొంది.

Similar News

News March 19, 2026

‘అమరావతి నిర్మాణానికి మెటీరియల్ నిరంతర సరఫరా జరగాలి’

image

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరాపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశానికి మైన్స్, CRDA, రెవిన్యూ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే సుమారు రూ.11 లక్షల టన్నుల మెటీరియల్ సరఫరాకు అనుమతులు మంజూరు చేశామని, కొత్త క్వారీ లీజుల ప్రక్రియ జరుగుతోందని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.

News March 19, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 19, 2026

ఓటుకు నోటు దొంగ రేవంత్: హరీశ్ రావు

image

TG: వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేత కాని సీఎం రేవంత్ విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజలకు గ్యారంటీల పేరు చెప్పి, మాయ చేసి ఓట్లు దండుకున్న రేవంత్‌ను మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. రైతు ద్రోహి అని, ఓటుకు నోటు దొంగ అని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు దిక్కు లేదని, ప్రభుత్వానికి ముందుంది మొసళ్ల పండగని హెచ్చరించారు.