News May 7, 2025
నారాయణపేట: బాలికపై అత్యాచారం.. 14 రోజుల రిమాండ్

బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. SI బాలరాజు తెలిపిన వివరాలు.. NRPTజిల్లా కోస్గి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను వికారాబాద్ జిల్లా దోమ మండలం మల్లేపల్లి వాసి రమేశ్ ప్రేమిస్తున్నానని చెప్పి మార్చి 5న తనవెంట తీసుకెళ్లాడు. 10రోజుల తర్వాత PSకు వచ్చి తాము పెళ్లి చేసుకుంటామని చెప్పాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రమేశ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Similar News
News July 5, 2025
MBNR: BJP కొత్త సారథి.. అభినందించిన డీకే అరుణ

హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాలమూరు ఎంపీ, జాతీయ కౌన్సిల్ మెంబెర్ డీకే అరుణ నూతన ఆయన్ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News July 5, 2025
MBNR: ‘58 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం’

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో మొత్తంగా 58 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందస్తు చర్యలలో భాగంగా అటవీ, ఉపాధి హామీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో 66.12 లక్షల మొక్కలను ఈపాటికే పెంచారు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గుంతలు తీసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రహదారుల వెంట 27,26,668 మొక్కలను నాటనున్నారు.
News July 5, 2025
జడ్చర్ల: అనుమానదాస్పదంగా మెకానికల్ ఇంజినీర్ మృతి

ఓ మెకానికల్ ఇంజినీర్ అనుమానస్పదంగా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు.. నవాబ్‌పేట(M) కాకర్ణాల సమీపంలోని ఓ మినరల్స్ కంపెనీలో కృష్ణా జిల్లా మంటాడకి చెందిన కాశి పూర్ణచందర్‌రావు(43) పనిచేస్తున్నారు. ఈనెల 2న విధులు ముగించుకుని గదికి వచ్చిన ఆయన గురువారం శవమై కనిపించాడు. తోటి ఉద్యోగులు పోలీసులకు సమాచారమందించారు. మృతుడి భార్య దీప్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.