News May 7, 2025
CID కోర్టులో మాధవరెడ్డికి ఊరట

మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో అరైస్టైన మాధవరెడ్డికి ఊరట లభించింది. ఆయన్ను జ్యూడీషియల్ రిమాండ్ కోసం CID అధికారులు చిత్తూరు సీఐడీ కోర్టులో శుక్రవారం రాత్రి హాజరుపరిచారు. అయితే అధికారులు అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సరైన డాక్యుమెంట్లు లేకుండా రిమాండ్‌కు ఆదేశించలేమంటూ జడ్జి పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
650 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఒక్కరోజే ఛాన్స్

RBIలో 650 అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికే రేపే చివరి తేదీ. 50% మార్కులతో డిగ్రీ పాసై, స్థానిక భాషలో ప్రావీణ్యం ఉన్న వారు అర్హులు. వయోపరిమితి 20-28 ఏళ్లు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.29,000-రూ.78,640 చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://rbi.org.in./
News March 7, 2026
కమలాపురం వద్ద టిప్పర్- బైక్ ఢీ.. ఒకరు మృతి

కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కమలాపురం మండలం రామచంద్రపురం పరిధిలో టిప్పర్ స్కూటర్‌ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి జంగంపల్లికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 7, 2026
జనగామ: ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

జనగామ జిల్లాలో రైతులకు విత్తనాలు, ఎరువులు సులభంగా అందుబాటులో ఉండేలా ప్రతి క్లస్టర్‌లో స్వయం సహాయక సంఘాల ద్వారా ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 62 క్లస్టర్లలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీవో, డీఏవో పాల్గొన్నారు.


