News May 7, 2025

రాజమండ్రి జైలుకి రైలులో దోచేస్తున్న దొంగలు

image

రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడి చేసి సెల్‌ఫోన్ అపహరించి, బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులను తెనాలి జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిడుబ్రోలుకు చెందిన దేవర సాయి, యర్రంశెట్టి వంశీ కాకినాడ- తిరుపతి రైలులో ప్రయాణిస్తున్న సంతోష్ కుమార్‌ను కొట్టి సెలోఫోన్ దొంగిలించారు. ఈ కేసులో టెక్నాలజీ పరంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం రాజమండ్రి జైలుకి తరలించారు.

Similar News

News February 21, 2026

సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కలెక్టర్

image

తూ.గో జిల్లాలోని గ్రామపంచాయితీల పరిధిలో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ.125.11 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు రూ.54.00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బకాయిలు చెల్లించాలన్నారు.

News February 21, 2026

రాజమండ్రి: టెన్త్‌తో ఉద్యోగాలు..19-35 ఏళ్లు వారే అర్హులు

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఫిబ్రవరి 23వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి 19-35 ఏళ్లు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులని వివరించారు.

News February 21, 2026

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ నరసింహ

image

ఇంటర్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ & సోలార్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.