News May 7, 2025
SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

TG: SLBC టన్నెల్‌లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల విరామం ఇచ్చారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తికాగా, తాజాగా ఎక్స్‌కవేటర్లు సొరంగం నుంచి బయటకు వచ్చాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా, ఇప్పటివరకు రెండు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఫిబ్రవరి 22న సొరంగంలో ప్రమాదం జరగగా, 8 మంది అందులో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 8, 2026
బంగ్లాదేశ్‌లో హిందువు హత్య.. ప్రధాన నిందితుడు అరెస్టు

బంగ్లాదేశ్‌లో సంచలనం రేపిన హిందువు <<18624742>>దీపూ దాస్ హత్య<<>> కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ టీచర్ యాసిన్ అరాఫత్‌ను ఇవాళ పట్టుకున్నారు. ‘దీపూ దాస్‌పై దాడికి ప్లానింగ్, అమలులో ఇతడు కీలకపాత్ర పోషించాడు. గుంపును ఎగదోయడం మాత్రమే కాదు.. దీపూను స్వయంగా కూడలిలోకి లాక్కెళ్లాడు. ఇన్నిరోజులు పరారీలో ఉన్నాడు’ అని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు.
News January 8, 2026
ప్రెగ్నెన్సీలో కాళ్లు వాపు వస్తున్నాయా?

ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు రావడాన్ని వైద్య పరిభాషలో జెస్టెషనల్ ఎడిమా అంటారు. గర్భిణిలలో ఏడో నెల నుంచి కాళ్లవాపు సాధారణంగా కనిపిస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు కాళ్లలో వాపు వస్తుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకున్నపుడు కూడా కొన్నిసార్లు కాళ్లవాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News January 8, 2026
ప్రతి విషయానికి బాధ పడుతున్నారా?

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ‖
విచారించకూడని విషయాల గురించి బాధపడటం సమయాన్ని వృథా చేసుకోవడమే! నిజమైన జ్ఞానులు పోయిన వారి గురించి కానీ, ఉన్న వారి గురించి కానీ, లేదా జరిగిపోయిన విషయాల గురించి కానీ అస్సలు శోకించరు. అనవసరమైన ఆలోచనలతో మెదడును సందిగ్ధంలో పడేయకుండా ఏది శాశ్వతమో తెలుసుకుని స్థితప్రజ్ఞతతో ఉండటమే అసలైన పరిష్కారం. <<-se>>#MSBP<<>>


