News May 7, 2025
విశాఖలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం డీఆర్సి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ మంత్రి డోలా బాల వీరాంజనేయులు దృష్టికి పలు సమస్యలు తీసుకువెళ్లారు. పరిపాలనాపరమైన అంశాల్లో అధికారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని, కాలయాపన చేయరాదని పేర్కొన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లోని అవసరాలకు సరిపడా సామర్థ్యం కలిగిన వీధి దీపాలు వేయాలని, దీని కోసం ముందుగా ఆడిట్ చేయాలని సూచించారు.
Similar News
News March 26, 2026
విశాఖ: ‘రేపు మాంసం దుకాణాలు మూసివేయండి’

గ్రేటర్ విశాఖ పరిధిలో మార్చి 27న శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని జీవీఎంసీ ఆదేశించింది. మాంసం, చికెన్, చేపలు, రొయ్యల విక్రయాలు పూర్తిగా నిషేధించినట్లు ప్రధాన వైద్యాధికారి డా.ఈఎన్‌వి.నరేశ్ కుమార్ తెలిపారు. నగరంలోని జంతు వధశాలలు కూడా మూసివేయాలని సూచించారు. ఆదేశాలను అతిక్రమించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 26, 2026
విశాఖ: గ్రేటర్ విస్తరణలో 64 గ్రామాల భవిష్యత్తు ప్రశ్నార్థకం!

గ్రేటర్ విశాఖలో వార్డుల పునర్విభజనతో 120 డివిజన్లు ఏర్పాటవుతుండగా, విలీన ప్రతిపాదనల్లో ఉన్న 64 గ్రామాల భవిష్యత్తు చర్చనీయాంశమైంది. పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, భీమిలి మండలాల గ్రామాలను గ్రేటర్‌లో కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే గ్రామీణ పథకాలు కోల్పోయే అవకాశం, పన్నుల భారం పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి లాభాలు ఉన్నప్పటికీ ఈ మార్పులను స్వీకరిస్తారా అన్నది సందేహంగా మారింది.
News March 26, 2026
విశాఖ: ‘మాతృ మరణాలు జరగకుండా చూడాలి’

విశాఖ DMHO కార్యాలయంలో DMHO జగదీశ్వరరావు మాతృ మరణాలపై బుధవారం సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో భవాని గార్డెన్స్ పట్టణ ఆరోగ్యకేంద్రం, పీఎంపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఒక్కొక్క మాతృ మరణం జరిగిందని మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూడాలన్నారు., హైరిస్క్ గర్భిణిలు ప్రసవానికి వచ్చినప్పుడు కేజీహెచ్‌కి గానీ VGHకి గానీ రిఫర్ చేయాలని ఆయన సూచించారు. మాతృమరణాలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


