News May 7, 2025
వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఖిలా వరంగల్-42.6, ములుగు రోడ్డు-42.9, సీరోలు(MHBD)-42.4, జఫర్‌గడ్(జనగామ)-42.8, కన్నాయిగూడెం(ములుగు)-43.2, ములుగు 42.5గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News March 5, 2026
దేశ భవిష్యత్తుకు ‘బరువు’ భయం!

<<19300696>>బాలల ఒబెసిటీ<<>> దేశ భవిష్యత్తును కలవరపెడుతోంది. ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు మున్ముందు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. పిల్లలు బరువు పెరగడం కంటిన్యూ అయితే దీర్ఘకాలిక వ్యాధులొచ్చి హెల్త్‌కేర్ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా భవిష్యత్ వర్క్‌ఫోర్స్ బలహీనపడుతుంది. అందుకే బడుల్లో వ్యాయామం తప్పనిసరి చేయాలి. స్కూళ్లు, ప్రభుత్వం కలిసి ఊబకాయంపై చైతన్యం తేవాలి. ఇంట్లో సమతుల ఆహారం అందేలా తల్లిదండ్రులు చూడాలి.
News March 5, 2026
ఆసిఫాబాద్: తెల్లవారుజామున ప్రమాదం.. ఒకరి మృతి

అతివేగం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. కౌటాల నుంచి వెళ్తున్న కోళ్ల వ్యాన్ పెద్దపల్లి వద్ద నియంత్రణ కోల్పోయి చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటేశ్ మృతి చెందగా, క్యాబిన్‌లో ఉన్న మరో డ్రైవర్ డౌలత్ క్షేత్రగాత్రుడయ్యాడు. తెల్లవారుజామున చీకటిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
News March 5, 2026
పెందుర్తిలో పంచాయతీల పరిస్థితి ఏంటి?

పెందుర్తి మండలంలోని పలు రెవెన్యూ పంచాయతీలు జీవీఎంసీలో కలవు. మిగిలిన 15 గ్రామాలు జీవీఎంసీలో విలీన ప్రక్రియ జరుగుతుందా అన్న సంసిద్ధత నెలకొంది. జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ఈనెల 17వ తేదీతో ముగుస్తుంది. కొత్త పాలకవర్గం రావాలంటే ఎలక్షన్లు జరగాలి. పంచాయతీలను వార్డులుగా విభజించి ఎలక్షన్ నిర్వహిస్తారా? పంచాయతీ ఎలక్షన్లు నిర్వహిస్తారా అనే అంశంపై స్థానికుల్లో గందరగోళం నెలకొంది.


