News May 7, 2025

వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఖిలా వరంగల్-42.6, ములుగు రోడ్డు-42.9, సీరోలు(MHBD)-42.4, జఫర్‌గడ్(జనగామ)-42.8, కన్నాయిగూడెం(ములుగు)-43.2, ములుగు 42.5గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News March 23, 2026

గ్యాస్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ADB SP

image

ఆదిలాబాద్ జిల్లాలో గృహ వినియోగ LPG గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా 8 బృందాలతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గ్యాస్ దుర్వినియోగం ప్రమాదాలకు దారి తీస్తుందని సూచించారు. అనుమానాస్పద వినియోగంపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News March 23, 2026

శ్రీకాకుళం: సదరంలో మరో ఐదు కొత్త వైకల్యాల చేర్పు.. DMHO వెల్లడి

image

వైకల్య సదరం సర్టిఫికెట్లు జారీలో కొత్తగా ఐదు రకాల వైకల్యాలను జాబితాలో చేర్చినట్లు DMHO అనిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో యాసిడ్ దాడిబాధితులు, స్పీచ్&లాంగ్వేజ్ డిజాస్టర్, అభ్యాసవైకల్యం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజాస్టర్, బహుళ వైకల్యం ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆమె అన్నారు. ఈనెల 25 నుంచి స్లాట్ బుకింగ్, 30 నుంచి నిర్ధారణ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

News March 23, 2026

ఎక్స్పైరీ పేరిట రూ.40 కోట్ల మందులు మాయం!

image

TG: పేద రోగులకోసం వినియోగించాల్సిన ₹40 కోట్ల విలువైన మెడిసిన్స్ పక్కదారి పట్టినట్లు సమాచారం. హాస్పిటల్స్‌కు పంపిణీ చేసే ప్రధాన కేంద్రం నుంచి ఈ మందులను ఎక్స్పైరీగా చూపి బయటి షాపులకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. క్యాన్సర్ వంటి రోగాలకు వాడే మందులూ ఇలా పక్కదారి పడుతున్నాయని కనుగొంది. విచారణలో స్టోర్ కీపర్ల వాంగ్మూలాలు నమోదు చేసింది. దీనిపై నివేదిక(H&FW/VIG/40CR-MED) రెడీ చేసింది.