News May 7, 2025

వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఖిలా వరంగల్-42.6, ములుగు రోడ్డు-42.9, సీరోలు(MHBD)-42.4, జఫర్‌గడ్(జనగామ)-42.8, కన్నాయిగూడెం(ములుగు)-43.2, ములుగు 42.5గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News March 9, 2026

జూరాల ప్రాజెక్ట్‌ కిందనే సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి: డీకే అరుణ

image

ఉమ్మడి పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. ఎంపీ డీకే అరుణ హాజరై జూరాల ప్రాజెక్టు భద్రతా అంశాలను లేవనెత్తారు. ప్రాజెక్టు రక్షణ కోసం ప్రత్యేకంగా బ్రిడ్జిని నిర్మించడంతో పాటు, ప్రజల రవాణా అవసరాల దృష్ట్యా R&B విభాగం ద్వారా అదనపు బ్రిడ్జిని సైతం నిర్మించుకునే వెసులుబాటును పరిశీలించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

News March 9, 2026

పాలమూరు: RTCలో అప్రెంటిస్‌షిప్ శిక్షణ

image

మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో 10 డిపోల గ్యారేజ్, ఆపరేషన్, ఆఫీస్ & వివిద విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు MBNR ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఇంజినీరింగ్, డిప్లొమా పట్టభద్రులు, నాన్ ఇంజినీరింగ్ పట్టభద్రులు(2021 తర్వాత పాస్ అయినవారు) అర్హులు. ఈ నెల 16లోగా http://nats.education.gov.in వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

News March 9, 2026

భూపాలపల్లి: ఆనాటి జగన్మోహిని కేశవ విగ్రహం.. నేడే ప్రతిష్ఠాపన

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని జగ్గయ్యపల్లె గ్రామ పరిసర ప్రాంతంలోని వాగులో 12వ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి శిలా విగ్రహం ఇటీవల లభించిన విషయం తెలిసిందే. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విగ్రహాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో జగ్గయ్యపల్లెకి తరలించారు. కాగా, విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం నేడు జగ్గయ్యపల్లెలో ఉ.8 నుంచి మ.12 వరకు నిర్వహించనున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు.