News May 7, 2025
NLG జిల్లాలో ఏటా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఇది ఇప్పుడు చిన్నవయసు వారిని సైతం బలితీసుకుంటుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 40 శాతం కేసులు టొబాకో రిలేటెడ్ క్యాన్సర్(టీఆర్సీ).. అంటే పొగాకు వినియోగించే వారివని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 20-25 ఏళ్ల యువతను పట్టిపీడిస్తోందంటున్నారు.
Similar News
News January 4, 2026
రాష్ట్రస్థాయి హాకీలో నల్గొండ జట్టుకు మూడో స్థానం

హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు సత్తా చాటింది. మూడో స్థానం కోసం నిజామాబాద్‌తో జరిగిన పోరులో 2-0 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. జట్టులోని రాకేష్, అఖిల్ నందన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కోచ్ యావర్‌ను డీఈఓ భిక్షపతి, డీవైఎస్ఓ అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హిమాం ఖరీం, ఎస్జీఎఫ్ కార్యదర్శి నర్సి రెడ్డి అభినందించారు.
News January 4, 2026
NLG: కానరాని కొత్త ఆవిష్కరణలు..!

NLG జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కేవలం తూతూ మంత్రంగా సాగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 2, 3 తేదీల్లో డైట్ కాలేజీలో జరిగిన ఈ వేడుకలో కొత్త ఆవిష్కరణల కంటే పాత ప్రాజెక్టులే ఎక్కువగా కనిపించాయని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యమిచ్చారని, విద్యార్థులను కొత్త ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించడంలో విఫలమయ్యారని విద్యావేత్తలు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News January 4, 2026
నల్గొండ: హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్

రహదారి భద్రతే ధ్యేయంగా జిల్లా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా <<18756458>>‘నో హెల్మెట్-నో పెట్రోల్’<<>> విధానాన్ని తెరపైకి తెచ్చారు. హెల్మెట్ లేనిదే బంకుల్లో పెట్రోల్ పోయవద్దని పోస్టర్ల ద్వారా ప్రచారం చేపట్టారు. అతివేగం, అజాగ్రత్తతో ప్రాణాలు కోల్పోకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే బంక్ యజమానులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.


