News May 7, 2025
HYDలో 3 ప్రాంతాల్లో వ్యభిచారం.. అరెస్ట్

HYDలో వ్యభిచార స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 48 గంటల్లో 3 చోట్ల ఈ ముఠాలకు చెక్ పెట్టారు. గురువారం బంజారాహిల్స్‌లో ఇద్దరు యువతులతో విటులు పట్టుబడ్డారు. శుక్రవారం లాలాగూడలో వ్యభిచారం చేయిస్తూ ఉగండా దేశస్థులు చిక్కారు. శ్రీనగర్‌కాలనీలోని ఓ స్పా సెంటర్‌లో తనిఖీ చేయగా ఆరుగురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 11, 2026
మరికల్ : వాహనాల దారి మళ్లింపు.. ప్రయాణికుల అవస్థలు

కర్ణాటకలో కుల సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో మరికల్ మండల కేంద్రంలో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. కృష్ణా-మాగనూరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో, రాయచూరు వెళ్లే వాహనాలను నారాయణపేట మీదుగా పంపిస్తున్నారు. మక్తల్, మాగనూరు, రాయచూరు వెళ్లే ప్రయాణికులు ఈ మార్పుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
News March 11, 2026
ఆదిలాబాద్: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల కోసం విషయ నిపుణులతో అవగాహన కార్యక్రమం, రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,888 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 5,443 మంది, బాలికలు 5,445 మంది ఉన్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు జరగనున్నాయి.
News March 11, 2026
WGL: చారిత్రక కట్టడాలకు జాతీయ గుర్తింపు… ఉపాధి అవకాశాలు!

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య పెరుగుతుండగా, ఉమ్మడి వరంగల్‌లో 6 కట్టడాలు ఉండటం ప్రత్యేకతగా నిలిచింది. దీంతో పర్యాటకుల రాక పెరిగి హోటళ్లు, గైడ్ సేవలు, హస్తకళల విక్రయం వంటి రంగాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గదుల కిరాయిలు, చిరు వ్యాపారులకు కాకతీయ కట్టడాలు వరంగా మారాయని కేంద్రం తీపి కబురు చెప్పినట్లు భావిస్తున్నారు.


