News May 7, 2025

సూర్యాపేట: బావిలో పడి వ్యక్తి మృతి

image

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారానికి చెందిన దేవులపల్లి రామ్మూర్తి అనే వ్యక్తి వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. ఇవాళ ఉదయం బహిర్బుమీకి వెళ్లిన గ్రామస్థులకు బావిలో శవమై కనిపించాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు కోదాడలో ఫెర్టిలైజర్ షాపులో పనిచేస్తున్నాడు.

Similar News

News March 28, 2026

NTR: ఫార్మ్-డీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్-డీ III/VI థియరీ పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 1లోపు ఫైన్ లేకుండా, ఏప్రిల్ 2లోపు రూ. 100 ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News March 28, 2026

ట్రంప్-మోదీ ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్

image

యుద్ధం నేపథ్యంలో ఇటీవల ట్రంప్, మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ కాల్‌లో మస్క్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే దౌత్యచర్చల్లో ఏ ప్రభుత్వ పదవిలో లేని ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం చాలా రేర్. ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీకి కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ కంట్రోల్ గురించి చర్చిస్తున్న సమయంలో మస్క్ ఉండటం చర్చనీయాంశమైంది.

News March 28, 2026

ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

image

ఇజ్రాయెల్ తాజా ఎయిర్ స్ట్రైక్స్‌లో ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అర్దకాన్ యురేనియం ప్లాంట్‌లను టార్గెట్ చేసింది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన కీలక ఇన్‌ఫ్రాను ధ్వంసం చేయడమే లక్ష్యమని IDF వెల్లడించింది. ఈ అటాక్స్‌లో ఎటువంటి ప్రాణనష్టం, రేడియేషన్ ముప్పు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.