News May 7, 2025
పాకిస్థాన్ వీసాలతో ఉన్నవారు వెంటనే వెళ్లిపోవాలి: ఎస్పీ

గుంటూరు జిల్లాలో పాకిస్థాన్ వీసాలతో ఉన్న పౌరులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. ఆ విధంగా వెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తుంటే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News September 10, 2025
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో స్టాపులు పునరుద్ధరణ

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని దొనకొండ, పిడుగురాళ్ల, కురిచేడు రైల్వే స్టేషన్లలో గతంలో రద్దు చేసిన రైళ్ల నిలుపుదలలను మళ్లీ పునరుద్ధరించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సమయపట్టిక ప్రకారం అన్ని రైళ్లు ఆగనున్నాయని అధికారులు వెల్లడించారు.
News September 10, 2025
నేడు ఉండ్రాళ్ళ తద్ది.. విశిష్టత తెలుసా

ఉండ్రాళ్ళ తద్ది నోమును భాద్రపద బహుళ తదియ రోజున స్త్రీలు ఆచరిస్తారు. దీని విశిష్టత ఏమంటే, ఈ నోమును పాటిస్తే పెళ్లికాని అమ్మాయిలకు మంచి భర్త లభిస్తాడని, వివాహితులు సుమంగళిగా ఉంటారని నమ్మకం. ఈ నోములో ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెడతారు, కాబట్టి దీనికి ఉండ్రాళ్ల తద్ది అనే పేరు వచ్చింది. ఐదు సంవత్సరాలు ఈ నోమును ఆచరించి, ఉద్యాపన చేసేటప్పుడు వాయనంతో పాటు చీర, రవికలను కూడా సమర్పిస్తారు.
News September 10, 2025
ఆనాటి హాస్యనటుడు పి.ఎల్. నారాయణ మన బాపట్ల వాసే

విలక్షణమైన నటుడు, రచయిత, నాటక ప్రయోక్త పి.ఎల్. నారాయణగా పేరుపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 – నవంబరు 3, 1998) ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, హాస్య ప్రధానమైన పాత్రలు పోషించారు. 1992లో యజ్ఞం సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.