News March 30, 2024

కామారెడ్డి జిల్లాలో 42 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శుక్రవారం జిల్లాలోని బిచ్కుందలో అత్యధికంగా 41.9 ఉష్ణోగ్రత నమోదు కాగా, దోమకొండలో 40.5, రామారెడ్డి, గాంధారిలో 40.4, నస్రుల్లాబాద్‌లో 40.2, పాల్వంచలో 40.1 ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా బీర్కూర్ మండలంలో 36.4 ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News March 13, 2026

NZB: ‘బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలి’

image

బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ పునః పరిశీలన (SRI)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ, లక్ష్యం మేరకు మ్యాపింగ్ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల, ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి VC నిర్వహించారు.

News March 13, 2026

‘అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తా’

image

అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.